
ఢిల్లీ20 డిసెంబర్ (హి.స.) అక్రమ బెట్టింగ్ యాప్‌నకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో తాజాగా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్(యూవీ), రాబిన్ ఉతప్ప, బాలీవుడ్ నటీనటులు సోనూసూద్, నేహాశర్మల ఆస్తుల్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జప్తుచేసింది. ఆ జాబితాలో నటి ఊర్వశీ రౌతేలా తల్లితో పాటు తృణమూల్ మాజీ ఎంపీ మిమీ చక్రవర్తి, అంకుశ్ హజ్రా (బెంగాలీ నటుడు) కూడా ఉన్నారు. ఈ కేసులో దర్యాప్తు సంస్థ వీరిని ఇప్పటికే విచారించగా.. తాజాగా జప్తుచేసిన ఆస్తుల మొత్తం విలువ రూ.7.93 కోట్లని ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది.
గతంలో మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధావన్‌కు చెందిన రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తుచేసిన సంగతి తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ