
ఢిల్లీ20 డిసెంబర్ (హి.స.) ప్రతికూల వాతావరణం కారణంగా ప్రధాని మోదీ ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ వెనక్కి మళ్లాల్సి వచ్చింది. పశ్చిమబెంగాల్‌లోని తాహెర్‌పుర్ హెలిప్యాడ్ వద్ద అది దిగాల్సిఉండగా.. దృశ్య గోచరత సరిగా లేక ల్యాండింగ్‌కు అంతరాయం ఏర్పడింది (PM's helicopter). ఉత్తర భారతాన్ని పొగమంచు కప్పేయడంతో ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు వెల్లడించారు.
పశ్చిమబెంగాల్ పర్యటనలో భాగంగా శనివారం ఉదయం ప్రధాని మోదీ (PM Modi) కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో తాహెర్‌పుర్‌కు బయల్దేరారు. అయితే పొగమంచు కారణంగా హెలిప్యాడ్‌పై ల్యాండింగ్‌కు వీలు కాలేదు. దాంతో పైలట్ ల్యాండింగ్‌కు కొద్దిసేపు ప్రయత్నించి విఫలమవడంతో హెలికాప్టర్ తిరిగి కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. వాతావరణ పరిస్థితి అనుకూలించేవరకు ప్రధాని అక్కడే వేచి చూశారని సదరు అధికారులు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ