
హైదరాబాద్, 21 డిసెంబర్ (హి.స.)
తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం మహాజాతరకు సంబంధించిన పోస్టర్ను సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో నేడు ఆవిష్కరించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, కొండా సురేఖ, సీతక్క పాల్గొన్నారు. 2026 జనవరి నుంచి 31వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ మహాజాతరను అత్యంత వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే మేడారం మాస్టర్ ప్లాన్తో సమ్మక్క సారలమ్మ గద్దెల పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..