ఎక్స్లో ప్రధాని మోడీ ప్రభంజనం: టాప్-10లో 8 పోస్టులు ఆయనవే!
హైదరాబాద్, 21 డిసెంబర్ (హి.స.) ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో తన తిరుగులేని ఆధిపత్యాన్ని మరోసారి చాటుకున్నారు. ''ఎక్స్'' ఇటీవల ప్రవేశపెట్టిన ''మోస్ట్ లైక్డ్'' ఫీచర్ ప్రకారం, భారత్లో గత 30 రోజుల్లో అత్యధిక లైకులు పొందిన మొదటి 10 పోస్టుల
ప్రధాని మోదీ


హైదరాబాద్, 21 డిసెంబర్ (హి.స.) ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో తన తిరుగులేని ఆధిపత్యాన్ని మరోసారి చాటుకున్నారు. 'ఎక్స్' ఇటీవల ప్రవేశపెట్టిన 'మోస్ట్ లైక్డ్' ఫీచర్ ప్రకారం, భారత్లో గత 30 రోజుల్లో అత్యధిక లైకులు పొందిన మొదటి 10 పోస్టుల్లో 8 పోస్టులు ప్రధాని మోడీవే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ జాబితాలో నిలిచిన ఏకైక రాజకీయ నాయకుడిగా ప్రధాని నిలవడం ఆసక్తికరంగా మారింది. ఆయన మొత్తం ఎనిమిది పోస్టులు కలిపి సుమారు 1.60 లక్షల రీపోస్టులు, 14.76 లక్షల లైకులను సాధించాయి.

ప్రధానంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో కలిసి ప్రయాణిస్తున్న ఫొటోకు అత్యధికంగా 2.14 లక్షల లైకులు రాగా, పుతిన్కు రష్యన్ భాషలో 'భగవద్గీత'ను అందజేస్తున్న ఫొటోకు 2.31 లక్షల లైకులు వచ్చాయి. వీటితో పాటు అయోధ్య రామమందిర ధ్వజారోహణ ఉత్సవం (1.40 లక్షల లైకులు), భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు విజయం (1.47 లక్షల లైకులు) వంటి అంశాలపై ఆయన చేసిన పోస్టులకు భారీ స్పందన లభించింది. ప్రస్తుతం ఎక్స్లో 10.8 కోట్ల మందికి పైగా ఫాలోవర్లతో, ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన నాల్గవ వ్యక్తిగా, అత్యధిక ఫాలోవర్లు ఉన్న ఏకైక దేశాధినేతగా మోడీ రికార్డు సృష్టించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande