
ఆదిలాబాద్, 21 డిసెంబర్ (హి.స.)
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను
చలిపులి వణికిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది చలి తీవ్రత విపరీతంగా పెరిగింది.
గడిచిన వారం రోజులుగా చలి తీవ్రత విపరీతంగా పెరగడంతో జిల్లా వాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు చలి తీవ్రతను తట్టుకోలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. చలి తీవ్రత పరిస్థితులు ఈ నెలాఖరు దాకా కొనసాగే అవకాశం ఉందన్న సమాచారంతో ప్రజానీకం ఆందోళనకు గురవుతున్నది.
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో చలి తీవ్రత మరింత ఎక్కువగా నమోదవుతున్నది.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు