సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో విషాదం.. భార్యాభర్తలు సూసైడ్
సిద్దిపేట, 21 డిసెంబర్ (హి.స.) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల వివరాల ప్రకారం.. మండల పరిధిలోని దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీ హర్ష, రుక్మిణీ దంపతులు బెజ్జంకిలో బట్టల దుకాణం
భార్యాభర్తలు సూసైడ్


సిద్దిపేట, 21 డిసెంబర్ (హి.స.) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల వివరాల ప్రకారం.. మండల పరిధిలోని దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీ హర్ష, రుక్మిణీ దంపతులు బెజ్జంకిలో బట్టల దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం భార్య భర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా, భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వీరికి మూడు సంవత్సరాల పాప హరిప్రియ ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande