కొత్త చార్జీలు ప్రకటించిన రైల్వే శాఖ
హైదరాబాద్, 21 డిసెంబర్ (హి.స.) రైల్వేశాఖ సవరించిన కొత్త రైల్వే చార్జీలను ప్రకటించింది. 215 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే ఆర్డినరీ క్లాసులో కిలోమీటరుకు ఒక పైసా చొప్పున పెంచింది. మెయిల్ లేదా ఎక్స్ ప్రెస్ నాన్ ఏసీ, ఏసీ తరగతులకు కిలోమీటరుకు
రైలు చార్జీలు


హైదరాబాద్, 21 డిసెంబర్ (హి.స.)

రైల్వేశాఖ సవరించిన కొత్త రైల్వే చార్జీలను ప్రకటించింది. 215 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే ఆర్డినరీ క్లాసులో కిలోమీటరుకు ఒక పైసా చొప్పున పెంచింది. మెయిల్ లేదా ఎక్స్ ప్రెస్ నాన్ ఏసీ, ఏసీ తరగతులకు కిలోమీటరుకు 2 పైసల చొప్పున పెంచింది. పెరిగిన చార్జీలు డిసెంబర్ 26 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఈ పెంపుతో రైల్వేశాఖకు రూ.600 కోట్ల ఆదాయం వస్తుందని ఆశిస్తోంది. అయితే ఒక ప్రయాణికుడు ఏసీ ట్రైన్ లో 500 కిలోమీటర్లు ప్రయాణిస్తే అతనిపై రూ.10 అదనపు భారం పడనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande