సంక్రాంతి.కి.ఊర్లు వెళుతున్న ప్రయాణికుల రద్దీని.దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం
అమరావతి, 23 డిసెంబర్ (హి.స.) : సంక్రాంతికి ఊరెళ్తున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో రద్దీని నియంత్రించేందుకు తాత్కాలిక స్టాపేజీని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా పల
సంక్రాంతి.కి.ఊర్లు వెళుతున్న ప్రయాణికుల రద్దీని.దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం


అమరావతి, 23 డిసెంబర్ (హి.స.)

: సంక్రాంతికి ఊరెళ్తున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో రద్దీని నియంత్రించేందుకు తాత్కాలిక స్టాపేజీని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా పలు ప్రాంతాల మధ్య సర్వీసులందించే 16 రైళ్లకు హైటెక్‌ సిటీ స్టేషన్‌ )లో తాత్కాలిక స్టాపేజీ కల్పించింది. దీంతో జనవరి 7 నుంచి 20వ తేదీ వరకు హైటెక్‌సిటీ పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రయాణికులు ఈ రైళ్లను హైటెక్‌ సిటీ రైల్వే స్టేషన్‌లోనే ఎక్కొచ్చు. ఈ మేరకు ఆయా రైళ్ల నంబర్లు, గమ్య స్థానాలు, ఆ స్టేషన్‌కు రైలు చేరుకునే, బయల్దేరే సమయం వంటి వివరాలతో అధికారులు చార్ట్‌ను విడుదల చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande