తెలంగాణ డీజీపీ నియామకం.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం
హైదరాబాద్, 24 డిసెంబర్ (హి.స.) తెలంగాణ డీజీపీగా జితేందర్ స్థానంలో శివధర్ రెడ్డిని నియమించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని పలువురు రాష్ట్ర హైకోర్టు ను ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభు
హైకోర్టు


హైదరాబాద్, 24 డిసెంబర్ (హి.స.)

తెలంగాణ డీజీపీగా జితేందర్ స్థానంలో శివధర్ రెడ్డిని నియమించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని పలువురు రాష్ట్ర హైకోర్టు ను ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల రద్దుకు నిరాకరించింది. అయితే, డీజీపీ నియామక ప్రక్రియ ప దాఖలైన పిటిషన్ను విచారించిన కోర్టు, నిబంధనల ప్రకారం రెండు వారాల్లోగా అర్హులైన ఐపీఎస్ అధికారులతో కూడిన ప్యానెల్ లిస్టును యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)కు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ ప్యానెల్ జాబితా ఉండాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. UPSCకి ప్యానెల్ లిస్టు పంపిన తర్వాత, ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర వివరణతో కూడిన కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande