
మెదక్, 24 డిసెంబర్ (హి.స.)
మెదక్ జిల్లాలో గతంలో కంటే భిన్నంగా
ప్రభుత్వ వైద్య సేవలు మెరుగుపడినవని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం చేగుంట మండలంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ ముందుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. తప్పనిసరిగా సిబ్బంది సమయపాలన పాటించి రోగులకు వైద్య సేవలు అందించాలని అన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, కలెక్టరేట్ కార్యాలయంలో సీసీటీవీ కెమెరాల ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరును పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు