కారు టైరు పేలి పక్క దారిలో.ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీ ఇద్దరు మృతి
చల్లపల్లి, 24 డిసెంబర్ (హి.స.) , : కారు టైరు పేలి పక్క దారిలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. కార్లోని నలుగురూ క్షేమంగా ఉన్నారు. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం మాజేరు గ్రామ సమీపంలోని మచిలీపట్నం జాతీయ
కారు టైరు పేలి పక్క దారిలో.ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీ ఇద్దరు మృతి


చల్లపల్లి, 24 డిసెంబర్ (హి.స.)

, : కారు టైరు పేలి పక్క దారిలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. కార్లోని నలుగురూ క్షేమంగా ఉన్నారు. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం మాజేరు గ్రామ సమీపంలోని మచిలీపట్నం జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదం రెండు ఇళ్లల్లో విషాదాన్ని మిగిల్చింది. పులిగడ్డ పంచాయతీలో ఔట్‌సోర్సింగ్‌ విధానంలో అటెండర్, కంప్యూటర్‌ ఆపరేటర్లుగా విధులు నిర్వహిస్తున్న సిరివెళ్ల భాగ్యరాజు(24), చెన్ను రాఘవ (25)లు ఒకే ద్విచక్ర వాహనంపై కార్యాలయం పనుల నిమిత్తం మచిలీపట్నం డీపీవో కార్యాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వీరిలో సిరివెళ్ల భాగ్యరాజుది కోడూరు మండలం పిట్టలంక కాగా, చెన్ను రాఘవది అవనిగడ్డ మండలం పులిగడ్డ గ్రామం.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande