
జహీరాబాద్, 24 డిసెంబర్ (హి.స.)
కోహిర్ మండలం సజ్జాపూర్
గ్రామంలో ఇటీవల చోటుచేసుకున్న ఎస్సీ కుటుంబంపై దాడి ఘటనపై తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య బుధవారం గ్రామాన్ని సందర్శించి సంఘటనపై సమగ్ర విచారణ చేపట్టారు. సజ్జాపూర్ గ్రామానికి చెందిన బేగరి రాములు ఇంటి షెడ్డు కూల్చివేసిన ఘటనపై బాధిత కుటుంబాన్ని కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనను పూర్తిగా అగ్రవర్ణాల దాడిగానే భావిస్తున్నామని కమిషన్ చైర్మన్ పేర్కొన్నారు. బాధితులకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. .
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు