కేటీఆర్ నోటికొచ్చినట్టు మాట్లాడటం సరికాదు : ఎమ్మెల్యే పోచారం
నిజామాబాద్,24 డిసెంబర్ (హి.స.) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనపై దుర్భాషలాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఇది మంచి పద్దతి కాదని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం బాన్సువాడలో సర్పంచ్, ఉప సర్పంచ్ అభ్యర్థు
ఎమ్మెల్యే పోచారం


నిజామాబాద్,24 డిసెంబర్ (హి.స.)

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

కేటీఆర్ తనపై దుర్భాషలాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఇది మంచి పద్దతి కాదని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం బాన్సువాడలో సర్పంచ్, ఉప సర్పంచ్ అభ్యర్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎంపీ సురేష్ శెట్కార్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సర్పంచ్ పదవీ రాజ్యాంగ బద్దమైనదని.. దాని విలువలు కాపాడాలని కోరారు. గ్రామస్తులు ఎంతో నమ్మక తో గెల్పించినందుకు వారి నమ్మాకాన్ని వమ్ము చేయకూడదని, గ్రామంలోని కావలసిన మౌలిక వసతులు కల్పించాలని త్రాగు నీరు, రోడ్డు, డ్రైనేజ్ వ్యవస్థలు చూసుకోవాలని సూచించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande