క్రిస్టియన్ భవన నిర్మాణానికి రూ, 25 లక్షలు మంజూరు చేస్తా : మంత్రి జూపల్లి
నాగర్ కర్నూల్, 24 డిసెంబర్ (హి.స.) కొల్లాపూర్ లో క్రిస్టియన్ భవన నిర్మాణం కొరకు తనకున్న సాంస్కృతిక శాఖ నుంచి రూ, 25 లక్షలను మంజూరు చేస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు క్రిస్టియన్లకు హామీ ఇచ్చారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా బుధవారం కొల్లాపూర్ లో ఓ
మంత్రి జూపల్లి


నాగర్ కర్నూల్, 24 డిసెంబర్ (హి.స.)

కొల్లాపూర్ లో క్రిస్టియన్ భవన

నిర్మాణం కొరకు తనకున్న సాంస్కృతిక శాఖ నుంచి రూ, 25 లక్షలను మంజూరు చేస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు క్రిస్టియన్లకు హామీ ఇచ్చారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా బుధవారం కొల్లాపూర్ లో ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొల్లాపూర్ లో క్రిస్టియన్ భవన నిర్మాణం కొరకు సాంస్కృతిక శాఖ మంత్రిగా తన శాఖ నిధుల నుంచి రూ.25 లక్షల నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటిస్తూ క్రిస్టియన్లకు భరోసా ఇచ్చారు. ఏసుక్రీస్తు అందరి జీవితాలను శాంతి సంతోషాలను కలుగజేయాలని సమావేశంలో పాల్గొన్న క్రిస్టియన్ సోదరీ, సోదరీమణులకు మంత్రి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande