
అమరావతి, 23 డిసెంబర్ (హి.స.)
ఢిల్లీ, ): తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌కు ( కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వాన్ని ప్రాతినిధ్యం వహించే అదనపు సొలిసిటర్ జనరల్గా ఆయనను మోదీ సర్కార్ నియమించింది. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ పదవికి దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన న్యాయపదవుల్లో ఒక్కటిగా గుర్తింపు ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ