
అమరావతి, 23 డిసెంబర్ (హి.స.)
:ఏపీ అసెంబ్లీ సెక్రటేరియట్ రూపొందించిన 2026 సంవత్సర క్యాలెండర్, డైరీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు (మంగళవారం) ఆవిష్కరించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు సమక్షంలో ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో 2026 క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్, డైరీలను సీఎం ఆవిష్కరించారు. జీవ వైవిద్యం - ఆంధ్రప్రదేశ్ సజీవ వారసత్వం అనే థీమ్‌తో క్యాలెండర్‌ను అసెంబ్లీ సెక్రటేరియట్ రూపొందించింది. ఏపీలోని ప్రకృతి సంపద, కళలు, సంప్రదాయాలు, ఆధునిక సాంకేతికతలకు అద్దం పట్టేలా కొత్త సంవత్సరం క్యాలెండర్‌ను రూపొందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ