
హైదరాబాద్, 23 డిసెంబర్ (హి.స.)
తెలంగాణ బీజేపీ చాలా బలంగా ఉందని కీలక నేత, మల్కాజ్గరి ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ చాలా బలంగా ఉంది అన్నారు. గతంలో హుజూరాబాద్లో పార్టీల లొల్లి ఉండేదని గుర్తుచేశారు. ఇప్పుడా పరిస్థితి లేదని.. బీజేపీ చాలా వేగంగా పుంజుకోవడంతో పాటు బలంగాస్థాయికి చేరుకుందని తెలిపారు. ఉపాధి హామీ పథకం విషయంలో సర్పంచ్లపై కుట్రలు జరిగాయని తెలిపారు. తనకు రాజకీయాల కంటే ప్రజలతో సంబంధాలే ముఖ్యమని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..