కేసీఆర్ వి అన్నీ జూటాకోర్ మాటలు : ఎంపీ డీకే అరుణ
హైదరాబాద్, 23 డిసెంబర్ (హి.స.) కేసీఆర్ వి అన్నీ జూటాకోర్ మాటలేనని ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. గతంలో పదేళ్లు అధికారంలో ఉండి మూడేళ్లలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పాడన్నారు. మూడేళ్లు కాదు పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్ర
డీకే అరుణ


హైదరాబాద్, 23 డిసెంబర్ (హి.స.)

కేసీఆర్ వి అన్నీ జూటాకోర్ మాటలేనని ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. గతంలో పదేళ్లు అధికారంలో ఉండి మూడేళ్లలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పాడన్నారు. మూడేళ్లు కాదు పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. దోపిడీ కోసమే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్టారని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి డిజైన్ మార్చాడని, ప్రాజెక్టు అంచనాలు అడ్డగోలుగా పెంచారని అన్నారు.

కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే డిజైన్ మార్చేవాడే కాదన్నారు. పాలమూరు రంగారెడ్డిలో జరగాల్సిన దోపిడీ జరిగిపోయిందని కానీ ప్రాజెక్టు మాత్రం పూర్తి కాలేదన్నారు. ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని ఆ ప్రాజెక్టుకు కేంద్రం ఎందుకు నిధులు ఇస్తుందని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande