సిట్ నోటీసుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా.. కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్, 23 డిసెంబర్ (హి.స.) ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ , మాజీ మంత్రి హరీశ్రావు లకు సిట్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వాగతిస్తున్నట్లుగా తెలిపారు. ఇవాళ ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ.. తనతో పాటు అగ్ర
బండి సంజయ


కరీంనగర్, 23 డిసెంబర్ (హి.స.)

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం

కేసీఆర్ , మాజీ మంత్రి హరీశ్రావు లకు సిట్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వాగతిస్తున్నట్లుగా తెలిపారు. ఇవాళ ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ.. తనతో పాటు అగ్ర నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేసి ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెట్టారని కామెంట్ చేశారు. చివరికి కన్న బిడ్డ, అల్లుడి ఫోన్లను కూడా ట్యాప్ చేసిన నీచులు అంటూ బీఆర్ఎస్పై మండిపడ్డారు. దేశవ్యాప్తంగా మంచి పేరున్న ఎస్ఐబీ (SIB) వ్యవస్థను రాష్ట్రంలో భ్రష్టు పట్టించారని ఫైర్ అయ్యారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande