అరెస్ట్ చేస్తే చేసుకోండి.. SIT నోటీసులపై హరీశ్ రావు కామెంట్స్
హైదరాబాద్, 23 డిసెంబర్ (హి.స.) ఫోన్ ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ సీపీ ఆధ్వర్యంలోని సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. త్వరలోనే మాజీ సీఎం కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీశ్ రావుకు కూడా నోటీసులు ఇచ్చి విచారిస్తారనే వార్తలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి
హరీష్ రావు


హైదరాబాద్, 23 డిసెంబర్ (హి.స.)

ఫోన్ ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ సీపీ ఆధ్వర్యంలోని సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. త్వరలోనే మాజీ సీఎం కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీశ్ రావుకు కూడా నోటీసులు ఇచ్చి విచారిస్తారనే వార్తలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. రాష్ట్రంలో 'సిట్'లు ఒక ప్రహసనం అయ్యాయని కామెంట్ చేశారు. ప్రభుత్వం డిఫెన్స్లో పడింది కాబట్టి తనకు నోటీసులు ఇస్తారట అంటూ ఎద్దేవా చేశారు.

అసెంబ్లీ సమావేశాలు ముగిసే 3వ తేదీ సాయంత్రం నోటీసులు ఇవ్వమని చెప్పారని తనకు సమాచారం ఉందని హరీశ్ రావు అన్నారు.

తమకు త్యాగాల చరిత్ర ఉందని.. అరెస్టుకు భయపడేది లేదన్నారు. అరెస్టు చేస్తే చేసుకోండి.. రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తామని అన్నారు. అతిగా వ్యవహరిస్తున్న ప్రతి అధికారి పేర్లు బుక్లో నోట్ చేస్తున్నామని, అక్రమాలు, అరాచకాలు, సెటిల్మెంట్లు అన్ని రికార్డు అవుతూనే ఉన్నాయని వార్నింగ్ ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande