
ఖమ్మం, 23 డిసెంబర్ (హి.స.)
అర్హతకు మించి వైద్యం చేస్తూ, క్లినికల్
ఎస్టాబ్లిష్మెంట్ నమోదు లేకుండా ప్రజలకు వైద్యం చేస్తున్న ప్రైవేటు హాస్పిటల్ల పై ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఐ) డాక్టర్ రామారావు నేడు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేయడంతో పాటు, తాను మందులు ఇస్తే వెంటనే తగ్గిపోతాయని ప్రజలను నమ్మించి వైద్యం చేస్తూ డబ్బులు దండుకుంటున్న గాయత్రి హాస్పిటల్ ను సీజ్ చేశారు.
అనధికారికంగా వైద్యం చేస్తున్న వైద్యుల పై ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు