
నారాయణపేట, 23 డిసెంబర్ (హి.స.)
నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ మౌలిక వసతుల కోసం సుమారు 60 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని, అందుకోసం దీర్ఘకాలిక -స్వల్పకాలిక ప్రణాళికలతో పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం ఉదయం మోటార్ బైక్ పై పట్టణంలోని గల్లీల్లో తిరుగుతూ అక్కడి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. వార్డుల్లో తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు తదితర అభివృద్ధి పనుల పై అధికారులకు ఆయన స్పష్టమైన సూచనలు చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు