పునరావాసం అంటే సంపూర్ణ జీవన వ్యవస్థ : కలెక్టర్
నాగర్ కర్నూల్, 23 డిసెంబర్ (హి.స.) నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల ప్రాంతంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ దేశానికి తలమానికంగా నిలుస్తోందని, దాని ప్రత్యేకతను కాపాడుకుంటూనే టైగర్ రిజర్వ్ పరిధిలోని తరలింపు గ్రామాల పునరావాసం, పునర్నిర్మాణ ప్రక్రియను
నాగర్ కర్నూల్ కలెక్టర్


నాగర్ కర్నూల్, 23 డిసెంబర్ (హి.స.)

నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల

ప్రాంతంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ దేశానికి తలమానికంగా నిలుస్తోందని, దాని ప్రత్యేకతను కాపాడుకుంటూనే టైగర్ రిజర్వ్ పరిధిలోని తరలింపు గ్రామాల పునరావాసం, పునర్నిర్మాణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా అమలు చేయాలని నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అటవీ, రెవెన్యూ, ఇంజనీరింగ్ శాఖల అధికారులను ఆదేశించారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామాల పునరావాస—పునర్నివాస ప్రక్రియ పై కలెక్టర్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande