
హైదరాబాద్, 23 డిసెంబర్ (హి.స.)
అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో భారత జట్టు పాకిస్తాన్ చేతిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే. అయితే, భారత ప్లేయర్లు నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించారని, వారిపై ఐసీసీ (ICC)కి ఫిర్యాదు చేస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మెన్ మోహ్సిన్ నఖ్వీ వ్యాఖ్యలు చేశారు.. ఐసీసీ రూల్స్ ప్రకారం రాజకీయాలకు క్రికెటర్లు దూరంగా ఉండాలని, కానీ భారత ఆటగాళ్లు తమ పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైదానంలో కూడా తమ ఆటగాళ్లను తరుచూ రెచ్చగొట్టారని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..