
హైదరాబాద్, 23 డిసెంబర్ (హి.స.)
శంషాబాద్ ను ప్రత్యేక జోన్ గా ఏర్పాటు చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో నేడు శంషాబాద్ బందు జరిగింది. పాఠశాలలు, కళాశాలలు, వ్యాపార సముదాయాలను స్వచ్ఛందంగా మూసివేశారు. శంషాబాద్ ను చార్మినార్ జోన్ లో కలపొద్దని ఈ సందర్భంగా జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. శంషాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీయొద్దని హితవు పలికారు. పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇక్కడి ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని శంషాబాద్ ప్రాంతాన్ని ప్రత్యేక జోన్ గా తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు