
జోగులాంబ గద్వాల, 23 డిసెంబర్ (హి.స.)
ఐదో శక్తి పీఠమైన జోగులాంబ
బాల బ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంగళవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు అర్చకులు పూర్ణకుంభస్వాగతం పలికారు. ముందుగా స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు చేశారు. అనంతరం అమ్మవారి ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆలయ విశిష్టతను వివరించి వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు శేష వస్త్రంతో సత్కరించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేశారు. ఆయన వెంట ఎంపీ మల్లు రవి ఎమ్మెల్యే విజయుడు ఉన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..