
హైదరాబాద్, 23 డిసెంబర్ (హి.స.)
ప్రభుత్వాలు ప్రజలకు అందించే
ఉచితాలపై మాజీ ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు చేసారు. మంగళవారం హైదరాబాద్ లోని నారాయణగూడ కేశవ మెమోరియల్ కాలేజీలో మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి శతజయంతి వేడుకలకు హాజరయ్యి, ప్రసంగించారు. ప్రభుత్వాలు ప్రజలకు ఉచిత విద్య, వైద్యం మాత్రమే అందించాలని.. ప్రతిదీ ఉచితంగా ఇచ్చి వారిని సోమరిపోతులుగా చెయ్యొద్దని హితవు పలికారు. ఫ్రీ బస్సులు ఇవ్వమని ప్రజలు అడగలేదని, దానికంటే ప్రజలకు నాణ్యమైన వైద్యం ఇవ్వాల్సిందని అన్నారు. ప్రభుత్వాలు ఉచితాలను ఆపేసి కష్టపడే వారికీ చేయూతనివ్వాలని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. దేశం ముందుకు వెళ్ళాలి అంటే యువతకు పెద్దపీట వేయాలని ప్రభుత్వాలకు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..