
అమరావతి,
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు దంపతులు తిరుమల శ్రీవారిని బుధవారం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు సింధు దంపతులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. వచ్చే ఏడాదిలో మలేసియా, ఇండోనేసియా బ్యాడ్మింటన్ టోర్నమెంట్లలో రాణించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ