
అమరావతి, 24 డిసెంబర్ (హి.స.),:డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లాలోని ఇప్పటం గ్రామంలో ఈరోజు (బుధవారం) పర్యటించారు. ఈ సందర్భంగా వృద్ధురాలు ఇండ్ల నాగేశ్వరమ్మ నివాసానికి వెళ్లి ఆమెను పరామర్శించారు పవన్. నీ బిడ్డగా నీ ఇంటికి వచ్చానంటూ నాగేశ్వరమ్మ కాళ్లకు పవన్ నమస్కరించారు. ఆపై వృద్ధురాలికి కొత్త బట్టలు ఇవ్వడంతో పాటు రూ.50 వేల నగదు, వికలాంగుడైన ఆమె మనవడికి లక్ష రూపాయలను డిప్యూటీ సీఎం అందజేశారు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ తన ఎమ్మెల్యే జీతం నుంచి రూ.5 వేలు ప్రతినెల పెన్షన్ రూపంలో వృద్ధురాలికి ఇస్తామని హామీ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ