చేవెళ్ళ బస్సు ప్రమాదం... ప్రధాన నిందితుడిగా టిప్పర్ ఓనర్
హైదరాబాద్, 24 డిసెంబర్ (హి.స.) తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో నవంబర్ 3న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కీలక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ప్రమాదానికి ఓవర్లోడ్, అతి వేగమే ప్రధాన కారణమని దర్యాప్తులో తేల్చిన పోలీసులు, ట
బస్సు ప్రమాదం


హైదరాబాద్, 24 డిసెంబర్ (హి.స.)

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల

మండలం మీర్జాగూడ సమీపంలో నవంబర్ 3న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కీలక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ప్రమాదానికి ఓవర్లోడ్, అతి వేగమే ప్రధాన కారణమని దర్యాప్తులో తేల్చిన పోలీసులు, టిప్పర్ యజమాని లచ్చు నాయక్ ను ప్రధాన నిందితుడిగా ఎఫ్ఎఆర్లో చేర్చారు. ప్రమాద సమయంలో డ్రైవర్ పక్కన టిప్పర్లోనే ఉన్న లచ్చు నాయక్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అయితే వాహనాన్ని అధిక లోడుతో నడిపించేందుకు అనుమతి ఇవ్వడంతోనే ఈ ప్రమాదం జరగగా ఆయన్నే ప్రధాన నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande