ఉపాధి హామీ కొత్త చట్టం.. డిసెంబర్ 26న గ్రామసభలు
హైదరాబాద్, 24 డిసెంబర్ (హి.స.) జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం ''వికసిత భారత్ - గ్యారంటీ ఫర్ రోజ్లర్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్)'' అనే నూతన చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టంలోని నిబంధనలు, శ్రామికుల హక్కులు, ఇతర కీల
ఉపాధి హామీ కొత్త చట్టం.


హైదరాబాద్, 24 డిసెంబర్ (హి.స.)

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం 'వికసిత భారత్ - గ్యారంటీ ఫర్ రోజ్లర్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్)' అనే నూతన చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టంలోని నిబంధనలు, శ్రామికుల హక్కులు, ఇతర కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 26న దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ రాష్ట్రాలను ఆదేశించింది. ఈ సభల్లో చట్టబద్ధమైన హక్కులపై చర్చించడంతో పాటు, కొత్త మార్పుల గురించి శ్రామికులకు వివరించనున్నారు.

ఈ కొత్త చట్టం ప్రకారం, ఏడాదికి కల్పించే పని దినాల సంఖ్యను గతంలో ఉన్న 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచారు. ఒకవేళ పని కోసం దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా ఉపాధి కల్పించకపోతే, రాష్ట్ర ప్రభుత్వమే సదరు కార్మికుడికి నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంటుంది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande