మరో రెండేళ్లలో కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారు : హరీష్ రావు
హైదరాబాద్, 24 డిసెంబర్ (హి.స.) మరో రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. నేడు ఆయన నివాసంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మాట్లాడుతూ.. తమ పార్టీ కార్యకర్తలకు, ప్రజలను ఇబ్బందులు పెడుతున్న వారి పే
హరీష్ రావు


హైదరాబాద్, 24 డిసెంబర్ (హి.స.)

మరో రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ

ముఖ్యమంత్రి అవుతారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. నేడు ఆయన నివాసంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మాట్లాడుతూ.. తమ పార్టీ కార్యకర్తలకు, ప్రజలను ఇబ్బందులు పెడుతున్న వారి పేర్లు రాసిపెట్టుకోవాలని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని ఆయన హెచ్చరించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ భయపడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో పూర్తిగా విఫలమైందని అన్నారు. బతుకమ్మ పండుగకు సగం మందికైనా చీరలు అందలేదని ఆరోపించారు. ప్రజా సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్కు త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని, ఆ రోజు చాలా దగ్గరలోనే ఉందని హరీష్రవు స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande