
హైదరాబాద్, 24 డిసెంబర్ (హి.స.)
తెలంగాణ సర్కారు మరో కీలక
నిర్ణయం తీసుకుంది. అనర్హులైన పెన్షనర్లను ఏరిపారేసింది. పేదలకు అందాల్సిన పెన్షన్లు పక్కదారి పడుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి రాగా.. ప్రభుత్వం సోషల్ అడిట్ మరింత కఠినంగా చేయాలని ఆదేశించింది. ఈ ఆడిట్ లో వేలాది పెన్షన్లు అనర్హులకు అందుతున్నట్టు తేల్చింది. ప్రస్తుతం వీరందరికీ పెన్షన్లు కట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే ప్రభుత్వం ముందుగా పైలట్ ప్రాజెక్టుగా 4 జిల్లాల్లో 20 వేల శాంపిల్స్ వడపోయగా.. అందులో 2 వేళా మంది అనర్హులుగా తేలింది. ధనవంతులు, 50 ఏళ్ళు నిండని వాళ్ళు, వైకల్యం లేకున్నా దివ్యాంగ పెన్షన్లు, చనిపోయినవాళ్లపై ఇతరులు అక్రమంగా ప్రభుత్వ సొమ్ము కాజేస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు అన్ని జిల్లాలలకు విస్తరించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు