కేటీఆర్ బావమరిది జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసులో కీలక పరిణామం
హైదరాబాద్, 24 డిసెంబర్ (హి.స.) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు చెందిన జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసులో మోకిలా పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ఎక్సైజ్ శాఖ అనుమతి లేకుండా ఈ ఫామ్ హౌస్ లో మద్యం పార్టీ నిర్వహించగా సైబరాబాద్
ఫామ్ హౌస్ కేసు


హైదరాబాద్, 24 డిసెంబర్ (హి.స.)

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు చెందిన జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసులో మోకిలా పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ఎక్సైజ్ శాఖ అనుమతి లేకుండా ఈ ఫామ్ హౌస్ లో మద్యం పార్టీ నిర్వహించగా సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులోపాల్గొన్న రాజ్ పాకాల స్నేహితుడు విజయ్ మద్దూరికి డ్రగ్స్ పాజిటివ్ రావడం కలకం రేపింది. ఈ పార్టీపై కేసు నమోదు చేసిన పోలీసులు మొత్తం 35 మంది స్టేట్ మెంట్లు రికార్డు చేశారు. రాజ్ పాకాలపై సెక్షన్ 34, ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు సాధించారు. రెయిడ్స్ సందర్భంగా ఫామ్ హౌస్లో భారీగా విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande