
మెదక్, 24 డిసెంబర్ (హి.స.) ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతోందని మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం మెదక్ జిల్లా చేగుంటలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మంజూరైన ఇందిరమ్మ ఇళ్లను వెంటనే ప్రారంభించే విధంగా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. అవసరమైతే గుత్తేదారులను నియమించి ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించాలన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు అవుతాయన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు