పేపర్ లీకేజీలకు చెక్ పెట్టనున్న ప్రభుత్వం.. క్వశ్చన్ పేపర్లకు జిపిఎస్ ట్రాకింగ్
హైదరాబాద్, 24 డిసెంబర్ (హి.స.) పేపర్ లీకేజీలకు చెక్ పెట్టనుంది ప్రభుత్వం. ప్రతిఏటా ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో ఎక్కడో ఒకచోట పేపర్ లీక్ అవడం ఇంటర్ బోర్డుకు తలనొప్పి వ్యవహారంగా మారింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లీకేజీలను ఆపలేకపోతోంది. అయితే ఇకపై ఎ
పేపర్ లీకేజ్


హైదరాబాద్, 24 డిసెంబర్ (హి.స.)

పేపర్ లీకేజీలకు చెక్ పెట్టనుంది

ప్రభుత్వం. ప్రతిఏటా ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో ఎక్కడో ఒకచోట పేపర్ లీక్ అవడం ఇంటర్ బోర్డుకు తలనొప్పి వ్యవహారంగా మారింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లీకేజీలను ఆపలేకపోతోంది. అయితే ఇకపై ఎలాంటి లీకేజీలకు తావు లేకుండా ఇంటర్ బోర్డు సాంకేతిక టెక్నాలజీతో సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఇంటర్ క్వశ్చన్ పేపర్లకు GPS ట్రాకింగ్ ఏర్పాటు చేయనుంది. ప్రింటింగ్ నుంచి ఎగ్జామ్ సెంటర్ వరకు పేపర్లను చేరవేసే వాహనాలకు GPRS ఏర్పాటు చేయనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande