
నిజామాబాద్, 24 డిసెంబర్ (హి.స.)
రాష్ట్ర ప్రభుత్వ జీవోలను వెంటనే అధికారిక సైట్లలో అప్ లోడ్ చేయాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వమే పదేళ్లు ఎన్నో జీవోలు దాచిపెట్టిందని ఆరోపించారు. రేవంత్ సర్కార్ పారదర్శకంగా వ్యవహరిస్తోందని చెప్పారు. కేసీఆర్ పాలనలో ఒక్క జీవో కూడా ప్రభుత్వ వెబ్ సైట్లోకి ఎక్కలేదని దీన్ని హైకోర్టు గమనించాలన్నారు. ఇవాళ నిజామాబాద్లో ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్.. ప్రతి జీవో ప్రజలకు అందుబాటులో ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు