
సంబల్పూర్/ఢిల్లీ26,డిసెంబర్ (హి.స.)
బంగ్లాదేశ్ వాసులుగా భావించి.. బెంగాలీ కూలీలపై దాడి చేయడం (తో ఓ కూలీ మరణించిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆరుగురు వలస కార్మికులు పనుల కోసం వెళ్తుండగా కొంతమంది వారిని అడ్డుకున్నారు. కూలీలను బంగ్లాదేశ్ వాసులుగా భావించి (suspicion of being Bangladeshis), వారి ఆధార్ కార్డులను చూపించాలని బెదిరించారు.
ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో కూలీలపై నిందితులు పదునైన వస్తువులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోగా (One person died in Odisha).. మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కూలీలపై దాడి చేసిన ఆరుగురు వ్యక్తులను గుర్తించి, అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ