
ఢిల్లీ26,డిసెంబర్ (హి.స.) రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లోని ఓ ఐటీ కంపెనీ సీఈవో (IT firm CEO) అయిన జితేశ్ ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా తన సంస్థలో పనిచేసే వారికి పార్టీ ఇచ్చారు. ఈ పార్టీ ముగించుకుని మహిళా మేనేజర్ ఇంటికి వెళుతుండగా.. కంపెనీలో పనిచేస్తున్న మహిళా ఎగ్జిక్యూటివ్ హెడ్ లిఫ్ట్ ఇస్తానని ఆఫర్ చేశారు. ఇదే కారులో ఎగ్జిక్యూటివ్ హెడ్ భర్తతో పాటు సీఈవో జితేశ్ కూడా ఉన్నారు. మార్గమధ్యంలో వారు ఓ దుకాణంలో సిగరెట్ లాంటి పదార్థాన్ని మేనేజర్‌కు ఇచ్చారు. దాన్ని తాగిన అనంతరం తాను స్పృహ కోల్పోయానని, దీంతో సీఈవో, ఎగ్జిక్యూటివ్ హెడ్ భర్త తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.
తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితుడైన కంపెనీ సీఈవో జితేశ్ సిసోదియా సహా ముగ్గురిని అరెస్టు చేసి, కోర్టు ముందు హాజరుపరిచినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల్లో కంపెనీ మహిళా ఎగ్జిక్యూటివ్ హెడ్, ఆమె భర్త కూడా ఉన్నట్లు తెలిపారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు కారు డ్యాష్‌కామ్‌లో రికార్డు అయినట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఘటన సమయంలో నిందితులు మద్యం మత్తులో ఉన్నారన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ