
ఢిల్లీ26,డిసెంబర్ (హి.స.) న్యూఢిల్లీ వేదికగా ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్’ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను చిన్నారులకు ప్రదానం చేశారు. ఈ పురస్కారాలు ధైర్య సాహసాలు, కళలు, సంస్కృతి, పర్యావరణం, ఇన్నోవేషన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, క్రీడలు అనే ఆరు విభాగాల్లో సృజనాత్మకత చూపించిన వారికి అందించారు. అవార్డు గెలుచుకున్న పిల్లలు, వారి తల్లిదండ్రులకు రాష్ట్రపతి అభినందనలు తెలిపారు. వారి సాహసాలు, విజ్ఞానం దేశానికి గర్వకారణం ఆమె ప్రశంసించారు
ఈ అవార్డులు దేశవ్యాప్తంగా ఉన్న పిల్లలందరికీ స్ఫూర్తినిస్తాయని రాష్ట్రపతి ముర్ము విశ్వాసం వ్యక్తం చేశారు. అవార్డు అందుకున్న వారిలో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, ఆగ్రాకు చెందిన అజయ్ రాజ్, పంజాబ్ కి చెందిన శవన్ సింగ్, మహారాష్ట్రకు చెందిన అర్ణవ్ అనుప్రియ మహర్షి, ఆంధ్రప్రదేశ్ కు చెందిన శివాని సహా మరికొంతమంది చిన్నారులు ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ