తపాలా ద్వారా అయోధ్యకు చేరిన వజ్రాల రాముడు
ఢిల్లీ26,డిసెంబర్ (హి.స.) బంగారం, వజ్రాలతో తయారు చేసిన రాముడి విగ్రహాన్ని బెంగళూరు నుంచి అయోధ్యకు తపాలా శాఖ తన లాజిస్టిక్‌ సేవల ద్వారా తరలించింది. ఈ విగ్రహాన్ని 12 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పుతో తంజావూరు శైలిలో కళాత్మకంగా రూపొందించారు. బెంగళూరు
ayodhya/gold/diamnd adorned idol


ఢిల్లీ26,డిసెంబర్ (హి.స.) బంగారం, వజ్రాలతో తయారు చేసిన రాముడి విగ్రహాన్ని బెంగళూరు నుంచి అయోధ్యకు తపాలా శాఖ తన లాజిస్టిక్‌ సేవల ద్వారా తరలించింది. ఈ విగ్రహాన్ని 12 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పుతో తంజావూరు శైలిలో కళాత్మకంగా రూపొందించారు. బెంగళూరుకు చెందిన జయశ్రీ ఫణీశ్‌ (50) ఈ విగ్రహాన్ని వెండి, బంగారం, వజ్రాలు, మాణిక్యాలు, ముత్యాలు, కెంపులతో సిద్ధం చేశారు. అయోధ్యకు పంపించేందుకు దీన్ని బెంగళూరులోని తపాలా శాఖలో డిసెంబరు 17న బుక్‌ చేశారు. అనంతరం ఎర్రచందనంతో చేసిన పెట్టెలో విగ్రహాన్ని ఉంచి సుమారు 1,900 కి.మీ. దూరంలో ఉన్న అయోధ్యకు భారీ భద్రత, నిఘా మధ్య తపాలా శాఖ ఈ నెల 22న చేర్చింది. సుమారు 800 కిలోల తూకం ఉన్న ఈ విగ్రహం, చెక్క పెట్టెను అక్కడి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రతినిధులకు అందజేశారు. అంగద తీల (తులసీదాసు విగ్రహం) వద్ద డిసెంబరు 29 నుంచి 31 మధ్యలో నిర్వహించే కార్యక్రమంలో దీన్ని ప్రతిష్టించనున్నారు. బాల రాముడ్ని పోలినట్లు రూపొందించిన తంజావూరు శైలి విగ్రహం ధర రూ.2 కోట్లు ఉంటుందని తయారీదారు పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande