
అమరావతి, 28 డిసెంబర్ (హి.స.)
, :ఉమ్మడి జిల్లాల్లో ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు సుమారు 68వేల మందికి పైగా ఉన్నారు. జిల్లా పరిషత్, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు దాదాపు 35వేల మందికిపైగా ఉన్నట్లు సమాచారం. ఈ విద్యార్థులంతా పేద, బడుగు, బలహీనవర్గాలకు చెందినవారే. ఉదయం ఇంట్లో ఏదో అల్పాహారం లేదా సద్దన్నం తిని పాఠశాలకు వస్తారు. మధ్యాహ్నం పాఠశాలల్లో పెట్టే భోజనం తర్వాత.. సాయంత్రం 7 గంటల వరకు వారు పాఠశాలల్లో ఉండాల్సి వస్తోంది. స్టడీ అవర్స్, స్లిప్ టెస్ట్‌లు, సబ్జెక్టుకు సంబంధించిన వీడియోలు చూడటం, ఇతర హోంవర్కులు, గణితం సబ్జెక్టులో ముఖ్యమైన లెక్కలు సాధన చేయడం వంటి పనులతో సాయంత్రం 7 గంటల వరకు పాఠశాలల్లోనే ఉండాల్సి వస్తోంది. ఈ సమయంలో అనేక మంది విద్యార్థులు ఆకలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ