
అమరావతి, 28 డిసెంబర్ (హి.స.)
అయోధ్య బాలరాముడిని దర్శించుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దివ్యమైన, అద్భుతమైన మందిరంలో రాముడి దర్శనం చేసుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని సీఎం అన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మికం అనుభవం ఉత్తేజకరంగా ఉందని ఆయన పేర్కన్నారు. శ్రీరాముడి విలువలు, ఆదర్శాలు మనందరికీ శాశ్వతమైన పాఠాలు అన్నారు. అవి ఎల్లప్పుడూ మనల్ని నడిపిస్తూ, ప్రేరేపిస్తూ ఉండాలని కోరుకుంటున్నాని చంద్రబాబు ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్ లోని అయోధ్యలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన బాలరాముడిని దర్శించుకున్నారు. దర్శనంకు ముందు సీఎంకి ఉత్తర్‌ప్రదేశ్ అధికారులు, ఆలయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆలయ అధికారులు ఆయోధ్య రామమందిరం నిర్మాణాన్ని వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ