
ఏలూరు, 28 డిసెంబర్ (హి.స.)
:ద్వారకా తిరుమలకుఈనెల 30వ తేదీన ముక్కోటి ఏకాదశి )సందర్భంగా భక్తులు భారీగా తరలి రానున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సామాన్య భక్తులతో పాటు వీఐపీలు కూడా వచ్చే అవకాశం ఉందని ఆలయ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది స్వామివారి గిరిప్రదక్షణ, నిజరూప దర్శనంతో పాటు ప్రత్యేక పూజలు జరుగుతాయని ఆలయ అధికారులు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ