
అమరావతి, 28 డిసెంబర్ (హి.స.)
అమరావతి: మిలియన్ ప్లస్ సిటీ.. రాష్ట్రంలో ఇప్పటివరకు విశాఖపట్నం, విజయవాడ మాత్రమే ఈ జాబితాలో ఉండగా.. తాజాగా గుంటూరు ఆ సరసన చేరేందుకు ప్రాథమిక కసరత్తు శనివారం పూర్తయింది. మొత్తం 18 గ్రామాలను జీఎంసీలో విలీనం చేసేందుకు కౌన్సిల్ ఆమోదించి కలెక్టర్‌కు పంపింది. ఇందులో 11 గ్రామాల్లో ఇప్పటికే గ్రామసభలు పూర్తవగా.. మిగిలినవాటికి నిర్వహించాల్సి ఉంది. ఇదంతా పూర్తయి.. ప్రభుత్వానికి పంపించాక ఆమోద ముద్ర పడితే మిలియన్ ప్లస్ సిటీగా అవతరించినట్టే. ఈ ప్రక్రియకు మరో మూడు రోజులే గడువు ఉండడం గమనార్హం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ