
అమరావతి, 28 డిసెంబర్ (హి.స.)
కొత్త సంవత్సరం ప్రారంభ నెల, సంక్రాంతి పర్వదినం సందర్భంగా జనవరి నుంచి రేషన్ కార్డుదారులకు బియ్యం, పంచదార, జొన్నలతో పాటు గోధుమ పిండి(హోల్ వీట్ ఆటా) పంపిణీ చేసేందుకు ఏపీ పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. బహిరంగ మార్కెట్లో హోల్ వీట్ ఆటా కిలో ధర రూ.40కి పైగా ఉంది. దీనిని సగం ధర రూ.20కే కిలో చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు సంబంధించి స్టాక్ కేటాయింపులు జరిగాయి. గుంటూరు జిల్లాలో గోధుమపిండి వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. 2,68,709 కేజీల ప్యాకెట్లను సివిల్ సప్లైస్ గోదాములలో నిల్వ ఉంచుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ