
హైదరాబాద్, 28 డిసెంబర్ (హి.స.)
ఈ నెల 29వ తేదీ నుంచి
జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డుపై ప్రకటన చేసి తక్షణమే అమలులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆటో యూనియన్ల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం హైదరూడలో ఏర్పాటు చేసిన విలేకరుల నమావేశంలో జేఏసీ నేతలు మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆటో డ్రైవర్లకు అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్కటి అమలు చేయలేదని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12 వేలు చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మహాలక్ష్మి పథకం కారణంగా ఆటో డ్రైవర్లు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ఇప్పటి వరకు 163 మంది మృతి చెందారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మృతి చెందిన ఆటో డ్రైవర్ల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అదుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయకపోతే జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో నిరసనలు తెలుపుతూ తమ సత్తా చూపిస్తామని వారు హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..