420 హామీలు ఇచ్చి వాటిని గాలికి వదిలేసిన కాంగ్రెస్.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్, 28 డిసెంబర్ (హి.స.) తెలంగాణలో రేపటి నుంచి జరగబోయే శీతాకాల సమావేశాలు కనీసం నెల రోజుల పాటు నిర్వహంచి అన్ని ప్రజా సమస్యలపై చర్చించాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రొసీజర్స్ ప్రకారం అసెంబ్లీ 1
బిజెపి ఎమ్మెల్యే


హైదరాబాద్, 28 డిసెంబర్ (హి.స.) తెలంగాణలో రేపటి నుంచి జరగబోయే శీతాకాల సమావేశాలు కనీసం నెల రోజుల పాటు నిర్వహంచి అన్ని ప్రజా సమస్యలపై చర్చించాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రొసీజర్స్ ప్రకారం అసెంబ్లీ 100 రోజుల పాటు నిర్వహించాల్సి ఉన్నా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి నిబంధనలు తుంగలోకి తొక్కుతున్నారని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. రేపటి నుంచి జరగనున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇవాళ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన ఏలేటి.. రాష్ట్రంలో రైతులు, రైతు కూలీల సమస్యలు ఉన్నాయని రైతు కూలీలకు రూ. 15 వేలు ఇస్తామని హామీ ఇచ్చి రూ. 12 వేలే ఇస్తామన్నారు. అవి కూడా పూర్తిగా ఇవ్వలేదన్నారు. రుణమాఫీ పూర్తిగా జరగలేదని, ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత ఇస్తామన్న రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఆ విషయం ప్రస్తావించడం లేదని నిలదీశారు. 420 హామీలు ఇచ్చి వాటిని గాలికి వదిలేశారని విమర్శించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande