
అహ్మదాబాద్, 28 డిసెంబర్ (హి.స.)
త్వరలోనే భారత్ నుంచి
మలేరియాను పూర్తిగా తొలగిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. నేడు అహ్మదాబాద్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) నిర్వహించిన ఆల్ ఇండియా మెడికల్ కాన్ఫరెన్స్ (IMA NATCON 2025)లో పాల్గొని ప్రసంగించారు. భారత్లో మలేరియా కేసులు 97 శాతం తగ్గాయని, అతి త్వరలో దేశం నుంచి పూర్తిగా మలేరియాను తరిమేస్తామని అన్నారు. ఆయుష్మాన్ భారత్, మిషన్ ఇంద్రధనుష్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆయన చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు