
హైదరాబాద్, 28 డిసెంబర్ (హి.స) ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (జీటీఏ ) ఆధ్వర్యంలో జరుగుతున్న జీటీఏ మెగా కన్వెన్షన్ 2025 ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్లో రెండు రోజుల పాటు ఈ వేడుకలు జరుగుతున్నాయి. తొలి రోజు ఈ వేడుకలో త్రిదండి చినజీయర్ స్వామి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి వివేక్ వెంకట్ స్వామి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు మల్లారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బొల్లం మల్లయ్య యాదవ్ తదితర ప్రముఖులు పాల్గొని వేడుకలకు శోభ చేకూర్చారు.
ఈ కన్వెన్షన్ కేవలం ఒక ఈవెంట్ మాత్రమే కాకుండా తెలంగాణ భవిష్యత్తు కోసం ప్రవాస భారతీయుల మేధస్సు, వనరులు, నెట్వర్క్ శక్తిని అనుసంధానం చేసే మహోద్యమమని జీటీఏ ఫౌండర్ అండ్ గ్లోబల్ చైర్మన్ అలుమల్ల మల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 30 దేశాల నుండి వేలాది మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..